Home తెలంగాణ విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి: ఎమ్మెల్యే జిఎంఆర్

విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి: ఎమ్మెల్యే జిఎంఆర్

296
0

TGN NEWS (పటాన్‌చెరు): విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన ఉషూ రాష్ట్రస్థాయి పోటీల్లో బీరంగూడ జడ్‌పీ హైస్కూల్ విద్యార్థిని ఎం. అశ్విని బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కాగా, అదే పాఠశాల విద్యార్థిని రుత్విక రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సన్మానించి అభినందించారు. క్రీడా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు వసంత, ఫిజికల్ డైరెక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here