విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో రామ్ చరణ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘పెద్ది’ తన సినీ కెరీర్‌లో అత్యంత ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని చరణ్ తెలిపారు. ఈ కథ తనను వ్యక్తిగతంగా, నటుడిగా ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. ఒక మనిషి పడిపోయిన తర్వాత తిరిగి ఎలా నిలబడతాడో చూపించే అద్భుతమైన కథ ఇదని వివరించారు.
అభిమానులే తన బలం అని చెప్పిన చరణ్, వారి ప్రేమ కోసమే కష్టపడుతున్నానని అన్నారు. “నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా” అంటూ అభిమానులకు హామీ ఇచ్చారు.
దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హీరోయిన్ జాన్వీ కపూర్‌లపై ప్రశంసలు కురిపించిన చరణ్, ‘పెద్ది’ విజయవంతం కావాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.



