Home తెలంగాణ సిర్పూర్ కాగజ్ నగర్‌లో వందే భారత్ రైలు నూతన స్టాప్ ప్రారంభం

సిర్పూర్ కాగజ్ నగర్‌లో వందే భారత్ రైలు నూతన స్టాప్ ప్రారంభం

0

TGN NEWS (పటాన్ చేరు): సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలు నూతన స్టాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ గూడెం నాగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఉమ్మడి మెదక్–నిజాంబాద్–కరీంనగర్–ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ అంజి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ అంజి రెడ్డి మాట్లాడుతూ—

👉 దేశంలో 150వ వందే భారత్ రైలును 2019లో ప్రారంభించామని తెలిపారు.

👉 తెలంగాణలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, మరికొన్ని 2 వందే భారత్ రైళ్లు ప్రారంభించే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

👉 మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ రైల్వే అభివృద్ధికి ₹40 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

👉 గతంలో తెలంగాణ రైల్వే అభివృద్ధి కోసం కేవలం ₹247 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో మోదీ గారు ₹5337 కోట్లు కేటాయించారని అన్నారు.

👉 ఇది గతంలో కంటే దాదాపు 20 రెట్లు అధిక నిధులు అని డాక్టర్ అంజి రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, జిల్లా అధ్యక్షులు శ్రీశైలంతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version