TGN NEWS(గుండ్లపోచంపల్లి): మున్సిపాలిటీ పరిధిలోని మునీరాబాద్ గ్రామంలోని అఖిల లపక్ష నాయకులు సహకరిస్తే మునీరాబాద్ ను మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా మునీరాబాద్ తాజా మాజీ సర్పంచ్ గణేష్ నేత చిట్టిమిల్ల,మాజీ ఉపసర్పంచ్ నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బలరాంరెడ్డిలు కమిషనర్ గారితో ప్రత్యేకంగా సమావేశమై మునీరాబాద్ గ్రామపంచాయతీ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో విలీనమైన తరువాత అనేక సమస్యలకు నెలవుగా మారిందని,వాటిని పరిష్కరించాలని కోరారు.వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్ కు వచ్చి మాజీ సర్పంచులు, అఖిలపక్ష నాయకులతో కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మునీరాబాద్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పార్క్,నర్సరీ,క్రీడా ప్రాంగణాలు గత సంవత్సర కాలంగా పట్టించుకునే వారు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వాటిని పునరుద్ధరించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని నాయకులు కమిషనర్ ని కోరారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీ అంతర్గత భూగర్భ మొరీల అవుట్ లెట్ ను జనావాసాలకు దూరంగా మార్చాలని, వైకుంఠధామం చుట్టూరా ప్రహరి గోడ నిర్మించాలని, పార్కులోని రోడ్లను, క్రీడా ప్రాంగణాన్ని శుభ్రపరచాలని,వాటి పర్యవేక్షణ కొరకు ఒక వ్యక్తిని నియమించాలని అఖిల పక్ష నాయకులు కోరారు. సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ వీలైనంత తొందరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అఖిల పక్ష నాయకులు గ్రామ అభివృద్ధి కొరకు పార్టీలకతీతంగా సమిష్టిగా ఉండడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కైరంకొండ గణేష్, గూడూరు శ్రీనాథ్ రెడ్డిలు, మాజీ వార్డు సభ్యులు నాగరాజు రెడ్డి నరేందర్లు, డి ఈ దుర్గా ప్రసాద్, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్,వార్డ్ ఆఫీసర్ అశ్వంత్, మధు, మహేష్, రామకృష్ణారెడ్డి, బిక్షపతి,భాస్కర్ రెడ్డి మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.