TGN NEWS (మనోహరాబాద్): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం మరియు రంగయపల్లి గ్రామాలలో ప్రతి శనివారం చుట్టుపక్క గ్రామాల రైతులు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయలు మార్కెట్లో అమ్మడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు కూడా రైతులకు కొనుగోలుదారులకు సహకారం చేస్తూ కూరగాయలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవడానికి గ్రామపంచాయతీ నుంచి సహకారం చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు.
