Home జాతీయం హైదరాబాద్‌లో జాబ్స్ జోరు.. వైట్ కాలర్ నియామకాల్లో 23% వృద్ధి

హైదరాబాద్‌లో జాబ్స్ జోరు.. వైట్ కాలర్ నియామకాల్లో 23% వృద్ధి

36
0

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌! దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా నియామకాలు 14 శాతం పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది.

ప్రముఖ జాబ్ పోర్టల్‌ నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన ‘జాబ్‌స్పీక్ ఇండెక్స్‌’ నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు ఏకంగా 23 శాతం పెరిగాయి. దీంతో మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కతా 22 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా జాబ్‌స్పీక్ ఇండెక్స్‌ కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఆగస్టులో 2,664 పాయింట్లుగా ఉన్న సూచీ.. ఈ ఏడాది ఆగస్టులో 3,028 పాయింట్లకు చేరుకుంది.

రంగాల వారీగా చూస్తే ఆటోమొబైల్‌ నియామకాల్లో 19 శాతం, ఆరోగ్య సంరక్షణలో 16 శాతం, రిటైల్‌లో 15 శాతం వృద్ధి నమోదైంది. ఐటీతో పాటు ఐటీయేతర రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ తర్వాత కోల్‌కతా ఉండగా.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భువనేశ్వర్‌ 32 శాతం వృద్ధితో టాప్‌లో నిలిచింది. రాయ్‌పూర్‌ 23 శాతం, సూరత్‌ 21 శాతం, రాంచీ 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్రెషర్ల నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల వరకు అన్ని అనుభవ కేటగిరీల్లోనూ నియామకాలు పెరిగాయి. దీంతో దేశీయ వైట్ కాలర్ ఉద్యోగ మార్కెట్‌లో సానుకూల వాతావరణం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here