TGN NEWS (మేడ్చల్) : మేడ్చల్ సర్కిల్ పరిధిలో BRS నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. మేడ్చల్ 298 డివిజన్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గుంతలు పడి వర్షానికి నిలిచిన *నీటిలో వరి నాట్లు వేసి నిరసన* వ్యక్తం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీని జిహెచ్ఎంసిలో విలీనం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని BRS నేతలు ఆరోపించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. పదికి పైగా కార్యాలయాలు ఉన్నచోటికి వెళ్లాలంటే ఇదే దారిని ప్రజలతోపాటు, ప్రభుత్వ అధికారులు సైతం ఉపయోగిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లలో పిల్లలు పడి చావాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు.






