Home తెలంగాణ సీఎంల ఆస్తుల జాబితా విడుదల.. కేసుల్లో రేవంత్ ముందంజ

సీఎంల ఆస్తుల జాబితా విడుదల.. కేసుల్లో రేవంత్ ముందంజ

3
0

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఆస్తులు, క్రిమినల్ కేసులపై నివేదిక విడుదల చేసింది.

ఆస్తుల పరంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ రూ.1,413 కోట్లతో తొలి స్థానంలో నిలవగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లతో రెండో స్థానం, తమిళనాడు సీఎం విజయ్ రూ.648 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 80 కేసులతో అగ్రస్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై 19 కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కూడా 19 కేసులు ఉన్నాయి. మొత్తం 31 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది.

అత్యల్ప ఆస్తులు కలిగిన సీఎంగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో నిలవగా, దేశంలోని అన్ని సీఎంల మొత్తం ఆస్తుల విలువ రూ.8,660 కోట్లుగా నివేదిక వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here