Home తెలంగాణ సాయిబాబాకు రూ.75 లక్షల గొడుగు కానుక

సాయిబాబాకు రూ.75 లక్షల గొడుగు కానుక

5
0

సాయిబాబాపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఓ భక్తుడు అరుదైన కానుకను సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన, ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న చంద్రశేఖర్ కమ్మెట్టి సుమారు రూ.75 లక్షల విలువైన బంగారు, వెండి గొడుగును శిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు అందజేశారు.

250 గ్రాముల బంగారం..

సాయిబాబా విగ్రహ అలంకరణతో పాటు పల్లకీ ఊరేగింపులో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఈ గొడుగును తయారు చేయించారు. ఇందులో 250 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 9 కిలోల వెండిని వినియోగించారు. గొడుగు మొత్తం బరువు సుమారు 9.25 కిలోలు. దీని తయారీకి దాదాపు రూ.75 లక్షలు ఖర్చయినట్లు చంద్రశేఖర్ తెలిపారు.

1998 నుంచి అనుబంధం..

ఉన్నత విద్య కోసం 1998లో అమెరికా వెళ్లిన చంద్రశేఖర్.. అదే ఏడాది తొలిసారి శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. అప్పటి నుంచి బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటున్నప్పటికీ ప్రతి ఏడాది నాలుగైదుసార్లు శిర్డీకి వస్తున్నట్లు చెప్పారు.

తన జీవితంలోని అనేక సందర్భాల్లో సాయిబాబా తనకు దిశానిర్దేశం చేశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గొడుగు సమర్పించే అవకాశం లభించడం కూడా బాబా అనుగ్రహమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కేవలం ఒక మాధ్యమంగా ఉండే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు.

గొడుగు సమర్పణకు సహకరించిన సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గడిల్కర్‌కు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here