TGN NEWS (నర్సాపూర్) : మండలంలోని ఆవంచ రెడ్డిపల్లి గ్రామాలను ఉత్తరప్రదేశ్ వివిధ జిల్లాలకు చెందిన అధికారులు , సర్పంచులు శిక్షణలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అధికారులు సర్పంచులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ (TGIRD) లో శిక్షణ పొందుతూ అనిల్ కుమార్ గారి మార్గదర్శకంలో క్షేత్ర పర్యటన (ఎక్సుపోజర్ విసిటు) లో భాగంగా నర్సాపూర్ మండలంలోని ఆవంచ, రెడ్డిపల్లి గ్రామాలను సందర్శించరు. యంపిడీఓ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి క్షేత్రస్థాయిలో వారు సందేహాలను నివృత్తి చేసుకున్నారు ముఖ్యంగా పంచాయతీలో జరుగుతున్న వివిధ పనులు తడిచెత్త పొడి చెత్త పారిశుద్ధ్యం పంచాయతీ నిధుల సమీకరణ ఉపాధి పనులు అందులో వాటర్ హార్వెస్టింగ్ నర్సరీ అగ్రి అలైడ్ వర్కులు మొదలైనవి. స్వయం సహాయక సంఘాల పనితీరు గురించి తెలుసుకోవడం జరిగింది వీటితోపాటు వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు . అదే విదంగా అంగన్వాడి, పాఠశాలలు, నర్సరీ, ఫారం పండు మొదలైన వాటిని సందర్శించారు ఈ కార్యక్రమంలో యంపిడీఒ మధులత ,డియల్పిఓ సాయిబాబా యంపిఓ శ్రీనివాస్ ఏపిఓ అంజిరెడ్డి, ఏపియం సంగమేశ్వర్ ,టిఏ మురళి IKP సిసిలు పంచాయతీ కార్యదర్శులు ఎఫ్ఏలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు




