Home తెలంగాణ కుత్బుల్లాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ

కుత్బుల్లాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ

253
0

TGN News (కుత్బుల్లాపూర్): గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ఆడపడుచులు ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకున్నారు. రకరకాల  పూలతో బతుకమ్మను అలంకరించి సాంప్రదాయ వేషధారణలో మహిళలు, ఆడపడుచులు పాటలు పాడుతూ నృత్యాలు చేసారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు సమిష్టిగా పాల్గొని బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల్లో బతుకమ్మకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.

గ్రామంలోని మహిళలు అందరూ కలిసి సామరస్యంతో పండుగను జరుపుకోవడం విశేషం. స్థానిక కళాకారుల పాటలు, డ్యాన్సులు, ఆటలు కార్యక్రమానికి మరింత ఆకర్షనియంగా నిలిచాయి. కార్యక్రమ అనంతరం బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ నిమజ్జన సమయంలో ఎలాంటి లోటుపాటులు లేకుండా అధికారులు, గ్రామ కమిటీ సభ్యులు భద్రతా చర్యలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here