TGN News (గుండ్లపోచంపల్లి): మున్సిపాలిటి సుతారి గూడెంలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. పలు వార్డులో మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ పాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడారు.

ఈ సందర్భంగా బతుకమ్మ పండుగను ఉద్దేశించి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏట దుర్గ దేవి నవరాత్రులలో భాగంగా సద్దుల బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటామని మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బతుకమ్మను అందంగా అలంకరించిన వారికి బహుమతులను అందజేశామని తెలిపారు.
