TGN News (కుత్బుల్లాపూర్): దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చ్ గగిల్లాపూర్, గండి మైసమ్మ కు చెందిన వాసిమ్ ఖాన్ కుమార్తె జెబ్ ఫాతిమా భాను ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు. ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి లబ్దిదారులకు తన కార్యాలయంలో CMRF చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
