Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలతో విభేదాలు లేవు.. రాజకీయ నాయకులతోనే పంచాయితీ: కవిత

ఆంధ్ర ప్రజలతో విభేదాలు లేవు.. రాజకీయ నాయకులతోనే పంచాయితీ: కవిత

0

తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ పోరాటం కేవలం ఆంధ్రా రాజకీయ నాయకుల విధానాలపైనేనని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో ఎక్కడపడితే అక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వీటి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కవిత, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమన్నారు. తెలంగాణలో నివసిస్తున్న సెటిలర్లందరూ తమవారేనని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

అయితే తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర గౌరవానికి భంగం కలిగించే చర్యలు జరిగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version