Home తెలంగాణ BHELలో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం

BHELలో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం

334
0

TGN NEWS (BHEL): తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం నిర్వహించారు. బీహెచ్ఈఎల్ ఎల్ ఐ జీ శ్రీ కార్య సిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డు, స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ లో నమోదు కోసం భరత నాట్యాచారిణి కోమలిశంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సంగీత‌, నాట్యాచారులు శేషుబాబు అన్నారు.

చిన్నారుల శ్లోక పఠనంతో వండర్ బుక్ ఆప్ రికార్డులో నమోదవడం ఆనందంగా ఉందని కోమలిశంకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర నేత ఎడ్ల రమేష్, బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here