బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డులు ఇచ్చేటప్పుడు బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసే పరిస్థితులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెరదించుతోంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, ఆర్థిక ఉత్పత్తుల తప్పుడు విక్రయాలను అరికట్టేందుకు RBI కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను విక్రయించడం, తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం, సరైన సమ్మతి లేకుండా అమ్మకాలు చేయడం వంటివి ‘మిస్-సెల్లింగ్’ కిందకు వస్తాయి. డిజిటల్ బ్యాంకింగ్ లో ‘డార్క్ ప్యాటర్న్స్’ వాడకాన్ని కూడా నిషేధించారు.