అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన 28 ఏళ్ల విద్యార్థి జీవనోపాధి కోసం పార్ట్‌టైమ్‌గా పిజ్జా డెలివరీ పని చేస్తూ ఉండగా దుండగుల కాల్పులకు బలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ పిజ్జా ఆర్డర్ రావడంతో విద్యార్థి సూచించిన చిరునామాకు డెలివరీ కోసం వెళ్లాడు. అయితే ఆ చిరునామా ఖాళీగా ఉన్న స్థలంగా తేలింది. అక్కడికి చేరుకున్న వెంటనే గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడి చేసి వెనుక నుంచి తలలో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలోనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు గుండ్లపోచంపల్లిలో విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం తట్టుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన ఫిలడెల్ఫియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిజ్జా డెలివరీ పేరుతో ఉచ్చులోకి దింపి హత్య చేసిన కోణంలో విచారణ కొనసాగిస్తున్న






