Home తెలంగాణ డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..! డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా స్టార్

డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ..! డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా స్టార్

0

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా ఆయన కొత్త పదవీకాలాన్ని ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, సిరాజ్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలంగాణ పోలీస్ శాఖకు గౌరవ డీఎస్పీ హోదా పొందిన మహ్మద్ సిరాజ్, పోలీస్ యూనిఫామ్‌లో డీజీపీని కలవడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన డీజీపీ సి.వి. ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

భేటీ అనంతరం సిరాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ సార్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఆయన పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆత్మీయంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

సిరాజ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు డీజీపీ సి.వి. ఆనంద్‌కు అభినందనలు తెలియజేస్తూనే, “డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ” అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్న మహ్మద్ సిరాజ్, మైదానంలో తన అద్భుత ప్రదర్శనతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version