రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘రామాయణ’ గ్లోబల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో యష్ రావణుడి పాత్రలో నటించడంతో పాటు కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేదికగా సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో యష్‌తో పాటు దర్శకుడు నితీశ్ తివారీ, హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌పై యష్ ప్రశంసలు కురిపించారు.
రాముడి పాత్రను పోషించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్న యష్.. రణ్‌బీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారని అన్నారు. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం రణ్‌బీర్ ఎంతో కష్టపడ్డారని, ఆయన డెడికేషన్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుందని ప్రశంసించారు.
ఇంత భారీ స్థాయి విజువల్ వండర్‌ను తెరకెక్కించడానికి కేవలం భారీ బడ్జెట్ మాత్రమే సరిపోదని, దానికి గట్టి సంకల్పం, సరైన టీమ్ అవసరమని యష్ అన్నారు. సరైన వ్యక్తులు ఒకచోట చేరినప్పుడు అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని తెలిపారు.
‘రామాయణ’ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి తమ జీవితాలను, తమను తాము చూసుకునే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయని యష్ భావోద్వేగంగా చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఈరోజు విడుదల కావాల్సిన ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్ వాయిదా పడినట్లు సమాచారం. ట్రైలర్‌ను మరింత గ్రాండ్‌గా, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.




