అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.
అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పుడు హీరోయిన్‌గా భాగ్యశ్రీ కాదు, శ్రీలీలను ఎంపిక చేశారు. ఆమెతో కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అఖిల్-శ్రీలీల కలిసి ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే రావడంతో ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు వినిపించాయి.
ఈ అంశంపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. సినిమా నుంచి శ్రీలీలను తప్పించడంలో ఎలాంటి విభేదాలు లేదా వివాదాలు లేవని స్పష్టం చేశారు. కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చిందని తెలిపారు.
“కథకు సంబంధించిన క్రియేటివ్ చర్చల కారణంగా మా వైపు నుంచి షూటింగ్ ప్రారంభం కొంత ఆలస్యమైంది. మేము షూటింగ్‌కు సిద్ధమయ్యే సమయానికి శ్రీలీల ఇచ్చిన డేట్స్ అందుబాటులో లేవు. అప్పటికే ఆమె కార్తీక్ ఆర్యన్ సినిమా, ‘పరాశక్తి’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా మారింది. దీంతో డేట్స్ క్లాష్ కావడంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇరు పక్షాల అంగీకారంతోనే హీరోయిన్‌ను మార్చాం. ఇందులో శ్రీలీల తప్పేమీ లేదు” అని నాగవంశీ వివరించారు.
హీరోయిన్ మార్పు కారణంగా ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాల్సి వచ్చిందని కూడా ఆయన తెలిపారు. అయితే భాగ్యశ్రీ బోర్సే నటనపై ప్రశంసలు కురిపించిన నాగవంశీ.. “సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత ఈ పాత్ర ఆమె కోసమే రాసినట్టుగా అనిపించింది. అద్భుతమైన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేసింది” అని అన్నారు.




