TGN NEWS (సిద్దిపేట): జిల్లాలో నివాసయోగ్యమైన రెండు పడక గదుల ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో 2 బిహెచ్కె ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత మరియు ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 2 బిహెచ్కె ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు అందించకపోవడం, ఇళ్లు అన్యాక్రాంతం కావడం వంటి ఘటనలు దృష్టికి వచ్చాయని. జిల్లాలో రెండుపడకల ఇళ్లు మంజూరు కాకుండా వేరేవాళ్లు ఆక్రమించి ఉంటునట్లుగా దృష్టికి వచ్చిందని, వెంటనే అధికారులు క్షేత్రస్తాయిలో తనిఖీలు నిర్వహించి, ఇళ్లు మైంజూరైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు ఉన్నట్లయితే వెంటనే వారిని ఖాళీచేయించి వాటిని తిరిగి అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని, మిగిలిన ఇళ్లను అధికారులు ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హతగల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి మిగిలిన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లను ఖాళీ చేయించినప్పటి తిరిగి అన్యాక్రాంతం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇప్పటివరకు ప్రారంభించని మరియు నిర్మాణం పూర్తి చేయడం సాధ్యం కానీ వాటిని రద్దు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వెంటనే ప్రైస్ మానిటరింగ్ కమిటీలను నియమించాలని, ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు, ఎలక్ట్రీషియన్లు, పెయిటింగ్, ప్లంబింగ్ కొరకు స్కిల్ లేబర్ లు కొంత మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయగలుగుతామని తెలిపారు. గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించిన అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా చేసేలా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, రామ్మూర్తి, చంద్రకళ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.