TGN NEWS (సంగారెడ్డి): ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామ ప్రసిద్ధ గణేష్ గడ్డ దేవస్థానంలో 78 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు నేతృత్వంలో నిర్వహించారు. ఆలయ ఈవో లావణ్య, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఏ. హరి ప్రసాద్ రెడ్డి, సేవా సమితి సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా హుండీ లెక్కింపు జరిపారు. హుండీ లెక్కింపులో మొత్తం రూ. 25,61,569 ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తం మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేసి, ఆలయ అభివృద్ధి, భవన నిర్మాణాలు, పుణ్య కార్యక్రమాలకు వినియోగిస్తామని ఈవో లావణ్య తెలిపారు. అలాగే, భక్తుల విశ్వాసం, అధికారులు చూపిన సమగ్రత కలసి ఆలయ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పి. నర్సింలు, కే. కృష్ణవేణి, ఏ. నాగరాజుగౌడ్, బ్యాగారి మంజుల, ఈ. నరసింహ గౌడ్, పి. వడ్డే నర్సింలు, జ్ఞానేశ్వర్, పి. నారాయణ, పి. ఆదిత్య రెడ్డి, పి. రుక్మారెడ్డి, ఎన్. నరసింహారెడ్డి, పి. మధుసూదన్ రెడ్డి, జోషి సంతోష్ పంతులు, ఈశ్వర్, సుధాకర్, శివ కేశవ స్వచ్ఛంద సేవా సంఘం కోఆర్డినేటర్ బి.ఎస్. మల్లేశ్వరరావు బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
