TGN NEWS (కొల్చారం): మండలంలోని సంగాయిపేట గ్రామంలో మంజీరా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస్ చారి ,మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి హాజరై సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి గ్రామ రైతులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని ,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రైతులు పాల్గొన్నారు.