TGN NEWS (కుత్భుల్లాపూర్): నియోజకవర్గం పరిధి గాజులరామారంలో గల సర్వే నెంబర్ 307, 329, 342ల్లో గల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టిజి ఐ ఎస్ సి, ఎచ్ ఎం డి ఏ వంటి సంస్థలతో పాటు ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది.

నిన్న మేడ్చల్ – మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి, రెవెన్యూ ఉన్నతాధికారుల పరిశీలనతో నేడు భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయించారు. మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా సుమారు 100 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఆక్రమించిన భూమిలో కొందరు 60 నుంచి 120 గజాల పరిమాణంలో ఇళ్లను నిర్మించి 10 లక్షలకు విక్రయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం అవుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టునట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ ధరకు స్థలాలు ఇస్తున్నామని ఆశచూపి ప్రభుత్వ భూములను కబ్జా చేసి విక్రయిస్తే చర్యలు తప్పవని, ప్రజలు కూడా మోసపోవద్దని సూచించారు.




