Home తెలంగాణ చిరు వ్యాపారులపైనేనా మీ ప్రతాపం..

చిరు వ్యాపారులపైనేనా మీ ప్రతాపం..

271
0

* మరి ఈ బిల్డింగ్ ల సంగతేంటి?

* అందరికీ సమాన న్యాయం
కావాలంటున్న పట్టణ
ప్రజలు

మేడ్చల్ పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లపై చిరు వ్యాపారులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లను, షాపులపై మున్సిపల్ అధికారులు కొరడా విధించారు. జెసిబి సహాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపల్ పరిధిలో గల వ్యాపారస్తులు ఇంటి నిర్మాణదారులు రోడ్డుపైకి వచ్చేలా నిర్మాణాలు షాపులు పెట్టవద్దని హెచ్చరించారు. అలా నిర్మాణాలు జరిపితే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. మున్సిపల్ అధికారుల ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరే ఇంతవరకు బాగానే ఉంది. అక్రమ కట్టడాలు ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే.

మరి అక్రమ బిల్డింగ్ ల సంగతి ఏంటి?

చిరు వ్యాపారులు రోడ్డుపై ఏర్పాటు చేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ అధికారులు మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ బిల్డింగుల నిర్మాణాలు, రోడ్డుపక్కలకు కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, మరి వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదు అంటూ పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఒక రకంగా పొంది.. మరోరకంగా బిల్డింగ్ నిర్మాణాలు సాగుతున్న మున్సిపల్ అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్టిల్ ప్లస్ టు అనుమతులు పొంది అదనంగా మరో రెండు మూడు అంతస్తులు నిర్మాణం చేపట్టిన ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ కమిషనర్ గాని ఎందుకు చర్యలు చేపట్టలేదో వివరించాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో అనుమతులు ఒకరకంగా.. నిర్మాణాలు మరోరకంగా ఉన్న ఎన్నో భవనాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయని స్థానికులు తెలిపారు. కనీసం వీటి వైపు కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులు చిన్న డబ్బా పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంటే జెసిపి సహాయంతో డబ్బాను తొలగించిన మున్సిపల్ అధికారులు.. అక్రమ కట్టడాలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితి మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన రాత్రికి రాత్రి షెడ్ల నిర్మాణాలు సాగుతున్న వాటి వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడరని విమర్శలు వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులకు ఓ న్యాయం.. బడా బాబులకో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిరు వ్యాపారులు రోడ్డుపైన అక్రమంగా డబ్బాలు పెట్టుకొని వ్యాపారం చేస్తే తొలగించాల్సిందే.. దాన్ని ఎవరు సమర్థించడం లేదు… అదేవిధంగా అనుమతులు ఒకరకంగా పొంది మరోరకంగా చేపడుతున్న కట్టడాల విషయంలోనూ మున్సిపల్ అధికారులు ఇదేవిధంగా స్పందించాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here