TGN NEWS (అమీన్ పూర్): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ అమీన్ పూర్ చెరువు గట్టు పైన లెటర్ రాసి చెరువులోకి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చెప్పులు, మొబైల్ ఫోన్, తన ఆత్మహత్యకు కారణాలు లెటర్ వ్రాసి చెరువు మెట్ల పై వదిలిన వ్యక్తి. చెరువులో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి హఫీజ్ పేట్ – ఆదిత్యనగర్ కాలనీ కి చెందిన బర్కతుల్లా ఖాన్ ( 28) గా గుర్తించిన పోలీసులు. తన భార్య (కలకత్తా కు చెందిన మహిళా) పై అనుమానం తో పలు సార్లు గొడవ పడి మాధపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.భార్య, భర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలతో భార్యను చితక బాదిన కేసు లో జైలు శిక్ష అనుభవించి విడుదల పై వచ్చిన బర్కతుల్లా ఖాన్ డెడ్ బాడీ కోసం చెరువులో గాలిస్తున్న ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అమీన్ పూర్ పోలీసులు.






