TGN NEWS (జహీరాబాద్): తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, జహీరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్ధన్ అన్నారు. శనివారం స్థానిక మాణిక్ ప్రభు హైస్కూల్లో జరిగిన బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతించారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల కరస్పండెట్ వెంకటయ్య, ప్రిన్సిపాల్ మధుసూదన్, గాయత్రీ కళాశాల లెక్చరర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.