Home తెలంగాణ జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు, రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు, రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ

25
0

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవడమే ఈ సమావేశాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.Houses of Parliament – Yi School Hub

నాలుగు వారాలపాటు సాగే ఈ సెషన్‌లో సుమారు 19 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలు, డీలిమిటేషన్ అంశం, ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వంటి కీలక రాజకీయ-చట్టపరమైన అంశాలు ఈసారి చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుకు అవసరమైన సీట్ల పెంపు అంశంపై ప్రభుత్వం మరోసారి ప్రయత్నించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.

ఇక రాజ్యాంగ 130వ సవరణ బిల్లుపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తీవ్రమైన నేరాల కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉండే ప్రజాప్రతినిధుల పదవులపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే బిల్లుల తుది జాబితా, సభలో ప్రవేశపెట్టే క్రమంపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

రాజకీయంగా కూడా ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. అధికార ఎన్డీయే బలం, ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యత, పార్టీల మధ్య మారుతున్న సమీకరణాలు సభా వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాష్ట్రాల హక్కులు, విదేశాంగం, సామాజిక అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. దీంతో వర్షాకాల సమావేశాలు చర్చలు, నిరసనలు, కీలక నిర్ణయాలతో వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here