Home తెలంగాణ పడిపోయిన బంగారం ధరలు..

పడిపోయిన బంగారం ధరలు..

7
0

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ఈ నెలలో సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్రమంలో గోల్డ్ రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రేట్లు అంతకంతకు దిగొస్తున్నాయి. మంగళవారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం

దేశీయ బులియన్ మార్కె్ట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,51,370 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజే రూ.160 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర ఇప్పుడు రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు రూ.150 తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,370 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,380 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,600 వద్ద ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,370 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here