Home తెలంగాణ డబిల్‌పూర్‌–లింగాపూర్‌ రహదారిపై కల్వర్టు కోసం రూ.70 లక్షలు.. ఎంపీకి వినతి

డబిల్‌పూర్‌–లింగాపూర్‌ రహదారిపై కల్వర్టు కోసం రూ.70 లక్షలు.. ఎంపీకి వినతి

44
0

ఎల్లంపేట్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని డబిల్‌పూర్‌–లింగాపూర్‌ రహదారిపై కల్వర్టు నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేయాలని కోరుతూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు. 15వ వార్డు కౌన్సిలర్‌ వేణుగోపాల్‌ గౌడ్‌ ఎంపీని కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరించారు.

డబిల్‌పూర్‌ నుంచి లింగాపూర్‌ వరకు ఉన్న రహదారి శ్రీరంగవరం, బండమాచారం, లింగాపూర్‌, డబిల్‌పూర్‌, బర్మాజిగూడ ప్రాంతాలకు ప్రధాన రవాణా మార్గంగా ఉందని వేణుగోపాల్‌ గౌడ్‌ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు రోజువారీ రాకపోకలకు ఈ రహదారినే వినియోగిస్తున్నారని చెప్పారు.

వర్షాకాలంలో నీటి ప్రవాహం కారణంగా రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కల్వర్టు నిర్మాణం పూర్తయితే ఐదు గ్రామాలకు చెందిన ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్‌ (MPLADS) నిధుల నుంచి రూ.70 లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టేందుకు సహకరించాలని ఈటల రాజేందర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగన్‌ గౌడ్‌తో పాటు నాయకులు శంకర్‌, పద్మారావు, శ్రీధర్‌, మధు, బిక్షపతి, ప్రవీణ్‌ యాదవ్‌, యాదగిరి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here