Home ఆంధ్రప్రదేశ్ పాలమూరు రైతుల కోసం రేవంత్ రంగంలోకి.. జూరాలకు 5 టీఎంసీలు కోరిన సీఎం

పాలమూరు రైతుల కోసం రేవంత్ రంగంలోకి.. జూరాలకు 5 టీఎంసీలు కోరిన సీఎం

38
0

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ఎద్దడిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కోరారు. మంగళవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. పాలమూరు ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటలపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు.

జూరాలకు తగినంత నీరు చేరకపోవడంతో ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసి జూరాలకు అదనపు ప్రవాహం వచ్చేలా చూడాలని కోరారు. రేవంత్‌ విజ్ఞప్తిపై శివకుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు, వకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేగా రెడ్డి, మధుసూదన్‌రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. కర్ణాటక సీఎంతో సమావేశమై పాలమూరు ప్రాంతంలో నెలకొన్న సాగునీటి పరిస్థితిని వివరించి నీటి విడుదలకు విజ్ఞప్తి చేశారు.

నీటిని విడతలవారీగా విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధులు కోరనున్నారు. మరోవైపు, సాగునీటితో పాటు రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగాన్ని సమతుల్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

జూరాల నీటి కోసం రైతులు ఇప్పటికే ఆందోళనలు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ రైతుల డిమాండ్‌కు మద్దతు ప్రకటించగా.. నీటి కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ చర్చ కూడా మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here