Home తెలంగాణ బీసీ మహిళలకు ఫ్రీ ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే కీలక ప్రకటన

బీసీ మహిళలకు ఫ్రీ ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే కీలక ప్రకటన

63
0

తెలంగాణలోని బీసీ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నారు. తక్కువ శ్రమతో వేగంగా పని చేసుకునేలా ఆధునిక మిషన్లను పంపిణీ చేయనున్నారు.

ఎవరికి ఇస్తారు?

లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వయోపరిమితి, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి, కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు వెల్లడించనున్నారు.

అర్హుల నుంచి ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించే తేదీలను కూడా ప్రకటించనున్నారు. దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం రేపు వెల్లడించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here