- బౌరంపేట్ ప్రభుత్వ స్థలంలో భారీగా అక్రమ నిర్మాణాలు
- ఎమ్మార్వో ఆదేశాలతో RI రవి ఆధ్వర్యంలో కూల్చివేతలు
- కూల్చిన చోట నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
TGN News ( దుండిగల్ ): ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. మండల పరిధి బౌరంపేటలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి.


ఈ మేరకు తహశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ చర్యలు చేపట్టారు. సర్వే నెంబర్ 576లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న బేస్మెంట్లను జేసీబీ సహాయంతో నేలమట్టం చేయించారు.

ఆర్ఐ రవి కుమార్ మాట్లాడుతూ కూల్చిన చోట నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కూల్చివేతలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.