Home తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి 

317
0

TGN NEWS (నర్సాపూర్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి ముఖ్యమంత్రికి పలు వినతిపత్రాలు అందజేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రతిపాదించారు. వాటిలో ప్రధానంగా, మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని, అంతారం గ్రామాన్ని కౌడిపల్లి మండలంలో కలపాలని, నర్సాపూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి నిధులు కేటాయించాలని, నియోజకవర్గ కేంద్రంలో కోర్టు భవనం, ఆర్డీఓ, ఎమ్మార్వో, అగ్రికల్చర్ కార్యాలయాలు నిర్మించాలని, కొత్తగా ఏర్పడిన చిలిప్‌చేడ్, మాసాయిపేట మండల కేంద్రాల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్ & బి శాఖ కింద రహదారి విస్తరణకు రూ.156 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమైన ప్రతిపాదనలు:

1. పిల్లికొట్యాల్ – చండి (ఎల్దుర్తి మార్గం) రహదారి (కిమీ 5/4 నుండి 25/5 వరకు) – రూ.60 కోట్లు

2. పోతంశెట్టిపల్లి – ఎల్దుర్తి – తూప్రాన్ రహదారి (కిమీ 0/0 నుండి 18/5 వరకు) – రూ.52 కోట్లు

3. చండి – కానుకుంట X రోడ్డు (కిమీ 0/0 నుండి 1/5 missing link) – రూ.4 కోట్లు

4. ధర్మసాగర్ – మంగళపర్తి రహదారి (కిమీ 0/0 నుండి 13/250 వరకు) – రూ.40 కోట్లు

అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ కింద రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వాటిలో:

హైదరాబాద్ – మెదక్ PWD రోడ్ నుండి దౌల్తాబాద్ – చిట్కుల్ PWD రోడ్ (శీలంపల్లి వరకు), కొనంపేట రహదారి అభివృద్ధి, రాజీపేట్ (తిమ్మాపూర్ – జాజీ తండా మార్గం) వద్ద HLB వంతెన నిర్మాణం, ముచ్చర్ల – ఎల్లాపూర్ రహదారి అభివృద్ధి, పిల్లికుంట్ల తండా – దౌజా తండా రహదారి, సికింద్లాపూర్ – లక్ష్మీనరసింహస్వామి ఆలయం రహదారి, సీతారాంపూర్ – HMB PWD రోడ్ రహదారి, గుండ్లపల్లి – మధిరా – నర్సాపూర్ రహదారి, రుస్తంపేట్ – రామచంద్రాపురం రహదారి అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయి. అదే విధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో హయాంలో ప్రతిపాదించిన పలు రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ అన్ని అభ్యర్థనలపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఆవుల రాజిరెడ్డి గారికి హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here