Home తెలంగాణ వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మండల సమైక్య మహాసభ

వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మండల సమైక్య మహాసభ

341
0

TGN NEWS (వెల్దుర్తి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం మండల సమైక్య మహాసభ నిర్వహించారు. మండల సమైక్య మండల అధ్యక్షురాలు కే రూప ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు, మండల సమైక్య సభ్యులు హాజరయ్యారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యక్రమం పై చర్చించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఇటీవల బదిలి పై వెళుతున్న మండల సమైక్య సిబ్బంది యాదగిరి, కిషన్, శ్రీనివాస్ గౌడ్, రజిత లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల సమైక్య మండల అధ్యక్షురాలు కే రూప, కోశాధికారి భాగ్య రాణి, ఏపిఎం సత్యనారాయణ, సీసీలు రాజు, స్వప్న, సుల్తానా, భాగ్యలక్ష్మి, లత, సీసీలు యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, రజిత, మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు ముక్తా బాయ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here