Home తెలంగాణ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్ లో కార్డెన్ సర్చ్

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్ లో కార్డెన్ సర్చ్

366
0

TGN NEWS (మేడ్చల్): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టాపూర్ లో గురువారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ కిష్టాపూర్ నుండి తరుచూ ఫిర్యాదు రావడం, ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వారు ఉండడం తో ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 300 ఇళ్లలో వెయ్యి మందిని తనిఖీ చేశామన్నారు. ఇందులో బీహార్ రాష్ట్రం నుంచి 110 మంది, ఒరిస్సా నుంచి 96, ఝార్కాండ్ నుంచి 72, అస్సాం నుంచి 52, ఉత్తరప్రదేశ్ నుంచి 36, మధ్యప్రదేశ్ నుంచి 14, మిగతావారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. వీరంది పూర్తి వివరాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో మూడు లిక్కర్ కేసులతో పాటు ఇద్దరు గాంజా కన్జూమర్స్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనాలు 18, నాలుగు చక్రాల వాహనాలు 2 స్వాదీనం చేసుకున్నామన్నారు. అదేవిదంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైన్, వాహన పెండింగ్ చలాన్లు కట్టని వాహనాలు సుమారు 15 వాహనాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన వ్యక్తి ఇక్కడ ఉండడంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. స్వాదీనం చేసుకున్న వాహనాలను వారి ఆధారాలు చూపించకుంటే సీజ్ చేయడం జరుగుతుందని, ఆదారాలు చూపిస్తే వారికి అందించడం జరుగుతుందన్నారు.

నిరంతరం పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉంటారని, రాత్రి వేళలో కూడా తనిఖీలు చేస్తూ ప్రజలకు రక్షణ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషన్ డీసీపి పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ గంగిరెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్, ఎస్ఓటీ సీఐ శ్యాంసుందర్ రెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల నుండి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సుమారు 200 మంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here