Home తెలంగాణ రేషన్ కార్డుదారులకు డబుల్ గుడ్ న్యూస్.. ఈ-కేవైసీకి మరో నెల గడువు.. 3 నెలల రేషన్...

రేషన్ కార్డుదారులకు డబుల్ గుడ్ న్యూస్.. ఈ-కేవైసీకి మరో నెల గడువు.. 3 నెలల రేషన్ ఒకేసారి!

1
0

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడంతో పాటు, మూడు నెలల రేషన్ బియ్యం, ఇతర సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

శుక్రవారంతో ఈ-కేవైసీ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది లబ్ధిదారులు ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం, రాష్ట్రంలో కొనసాగుతున్న ‘స్మార్ట్’ ప్రక్రియ, భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.

మొదట ఈ సడలింపును జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితం చేయాలని భావించినా, జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఇక శనివారం నుంచి ఈ-కేవైసీ పూర్తయిందా లేదా అనే విషయాన్ని పక్కనబెట్టి మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి అందజేయనున్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారు ఆగస్టు 31లోపు సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here