TGN NEWS (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్, వేల్దుర్తి మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹12,78,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ –”ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ సహాయం మాకు నిజమైన భరోసాగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా కుటుంబాలకు ఇది ఆశాకిరణంగా మారింది. ఈ సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎల్లప్పుడూ మా సమస్యలను పట్టించుకుని, సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు
Home తెలంగాణ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి



