సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీనీ శనివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తో కలిసి సందర్శించి డ్రై రన్ ద్వారా జరుగుతున్న ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు.ప్రపంచంలోని అత్యాధునిక యంత్రాలతో కూడిన యంత్రాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా నార్మెట్టాలో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని నిర్మించాం.త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించి, ఫ్యాక్టరీ వద్ద రాష్ట్రంలోని లక్షమంది ఆయిల్ ఫామ్ రైతులతో సభ నిర్వహిస్తాము. రాష్ట్ర మంత్రిగా మొదటి సంతకం ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినది చేశాను.
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులకు ఎక్కడ సమస్య రాకుండా చూశారు. సిద్దిపేట్ జిల్లా అధికార యంత్రాంగం మరియు ఆయిల్ ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ వేగంగా జరిగేలా చూశారు. వారికి అభినందనలు. అధిక వర్షాలతో మధ్యలో కొంత అంతరాయమైన పనులు వేగంగా జరిగాయి. మన దేశం ప్రతి సంవత్సరం వంట నూనె కోసం లక్ష కోట్ల రూపాయలను ఇతర దేశాలకు చెల్లిస్తుంది. కేవలం మూడు శాతం నూనె మాత్రమే మన దేశంలో తయారవుతుంది.ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ఆయిల్ రిఫైనరీ కూడా నిర్మిస్తున్నాము. కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనె ఇక్కడ ఉత్పత్తి అవుతది. ఎలాంటి పొల్యూషన్ రాకుండా పామాయిల్ గింజల పిప్పి తో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము.కరెంటు ఇబ్బందికి కూడా ఫ్యాక్టరీ కి ఉండదు.గింజల నుంచి కూడా ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నాము. దాంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్తుంది.ఈ ఫ్యాక్టరీలో ఓ.ఇ.ఆర్ కూడా అధికంగా ఉండడంతో భవిష్యత్తులో ఇక్కడ నిర్ణయించే ధరను నిర్ణయించి దేశంలోని ఆయిల్ ఫామ్ రైతులకు చెల్లించడం జరుగుతుంది.

సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తైన స్థానంలో ఉంది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో ఉంది ఎక్కడి నుండైనా సులభంగా ఆయిల్ ఫామ్ గెలలను రవాణా చేయవచ్చు రైతులకు మూడు రోజుల్లోనే పేమెంట్ చెల్లిస్తున్నాము.దేశంలో 13 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుతుంది దానిలో సుమారు పది లక్షల ఎకరాలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంది.మానవ జన్మ ఉన్నంతవరకు ఆయిల్ ని వాడుతూనే ఉంటారు. కాబట్టి పామాయిల్ రైతులకు డోకా లేదు భయపడకుండా ఆయిల్ ఫామ్ సాగు చేయాలి.ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 79 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట వస్తుంది. ఈ సంవత్సరంలో మరో లక్ష ఎకరాలు అదనంగా రావాలి, రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక లక్ష ఎకరాల పామాయిల్ సాగు జరగాలి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమి ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంది. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరిగితే మనమే దేశంలో మొదటి స్థానంలో ఉంటాం. ఆంధ్రాలో 40 సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ మొక్కలనను నాటడం ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ ఐదు, ఆరు లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లోనే 6 లక్షల ఎకరాల్లో సాగు చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణని నిలపాలి.తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలనేది మా ఆకాంక్ష. ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ మండలాల వారీగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం టార్గెట్ పెట్టి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంతర పంటగా కోకో, జాజి లాంటి పంటలు వేసుకోవాలి. పామాయిల్ పంటలలో దిగుబడి తగ్గకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ దిగుబడి పెంచేలా రైతులకు సూచనలు సలహాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వం టన్నుకు25 వేల రూపాయల ధర చెల్లించాలి.రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.రైతుల కోసం నిరంతరం పరితపించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సమయానికి సంకుర్చేలా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.రైతులకు యూరియా అందించేలా కేంద్రంతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు.ఆయిల్ ఫామ్ ప్యాక్టరీన పూర్తయి రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్ హేమావతి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా రైతుల అదృష్టవంతులు ఆయిల్ ఫామ్ పంటను అమ్మకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగానే ఫ్యాక్టరీ సిద్ధం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా పూర్తి చేశాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ రాష్ట్ర డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగ్రవాల్, అయిల్ ఫెడ్ ఎండి. శంకరయ్య, జిల్లా ఉద్యానవఅధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్, ఉద్యానవన వ్యవసాయ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
