సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి స్ఫూర్తితో, ఆయన ప్రత్యేకంగా నేసిన ‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’ను శ్రీ కనకదుర్గ అమ్మవారికి అలంకరణ చేయాలని కోరుతూ ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు అందజేశారు. ఈ పట్టుచీర 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పుతో కేవలం 200 గ్రాముల బరువు కలిగి, ఇక్కత్ డిజైన్ తో రూపొందించబడింది. గతంలో ప్రధాని మోదీకి ‘ఆపరేషన్ సింధు’ శాలువాను అందించిన విజయ్ కుమార్, అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఈ చీరను సమర్పించారు.

