Home తెలంగాణ భారత్‌కు మరో రక్షణ విజయగాథ.. రుద్రం-2 క్షిపణి పరీక్ష సక్సెస్!

భారత్‌కు మరో రక్షణ విజయగాథ.. రుద్రం-2 క్షిపణి పరీక్ష సక్సెస్!

13
0

దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం-2 యాంటీ-రేడియేషన్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసే ఈ అత్యాధునిక క్షిపణి 300-350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాక్ 5.5 వేగంతో ఛేదించగలదు.

సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ క్షిపణి, శత్రువులు రాడార్లను నిలిపివేసినా వాటి స్థానాన్ని గుర్తించి దాడి చేయగలదు. దీంతో భారత వైమానిక దళం యొక్క దాడి సామర్థ్యం మరింత పెరగనుంది.

రక్షణ నిపుణులు ఈ విజయాన్ని భారత రక్షణ రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది గట్టి హెచ్చరికగా మారనుందని విశ్లేషిస్తున్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ క్షిపణి, భారత రక్షణ స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here