TGN NEWS (కుత్బుల్లాపూర్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పేట్ బషీరాబాద్ గ్రామంలో కరెంట్ స్తంభం ఒక పక్క ఒంగి ప్రమాదకరంగా మారింది. నిత్యం వందల మంది ప్రయాణించే ఆ మార్గంలో కరెంట్ స్తంభం ఒక పక్క వాలటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్తంభం కింద పడకుండా రాళ్లను అడ్డం పెట్టామని తెలిపారు. అసలే వర్షాకాలం మట్టి కుంగి స్తంభం ఇళ్లపై పడితే ప్రమానష్టం జరిగే అవకాశం ఉందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పాత స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
Home తెలంగాణ ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం.. ప్రమానష్టం జరగకముందే అధికారులు స్పందించాలని డిమాండ్
