Home తెలంగాణ తెలంగాణ జనసేనలో కొత్త జోష్.. పవన్ సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు

తెలంగాణ జనసేనలో కొత్త జోష్.. పవన్ సమక్షంలో పార్టీలోకి భారీగా చేరికలు

28
0

తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా జనసేన పార్టీ కీలక అడుగులు వేస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో రాజకీయ, విద్య, కార్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జనసేనలో చేరిన వారిలో తెలంగాణ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి. రవీందర్ ముఖ్యులు. వీరితో పాటు ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత, నిజామాబాద్‌కు చెందిన మీసాల శ్రీనివాస్ రావు, ట్రేడ్ యూనియన్ నేత దేవరకొండ రామ్మోహన్ రావు, హైకోర్టు న్యాయవాది మైదంశెట్టి రవివర్మ, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బి. రవీందర్ గౌడ్ తదితరులు పార్టీలో చేరారు.

వీరితో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు బత్తిని సత్యనారాయణ గౌడ్, ఆరే మహేందర్, వైద్య రంగ నిపుణులు డాక్టర్ బండారు రాజ్‌కుమార్, డాక్టర్ ఎడ్ల సాయి కృష్ణప్రియ కూడా జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు.
New Josh in Telangana Janasena as leaders join the party in large numbers
త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేసే వ్యూహంలో భాగంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here