TGN NEWS (పటాన్ చేరు ): సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అనంతరం ఆసుపత్రి చుట్టుపక్కల స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు.నాయకులు మాట్లాడుతూ “ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు. ‘స్వచ్ఛ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి పథకాల ద్వారా భారత్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణం” అని అన్నారు. కార్యక్రమంలో సరస్వతి, బలరాం, వడ్ల పద్మావతి, శ్రీశైలం, రావి కుమార్ యాదవ్, లక్ష్మీ, అఖిల్, శ్రీనివాస్, రాజు, మల్లేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
