దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా? లేక ప్రజల అసలు తీర్పు భిన్నంగా ఉంటుందా? అనే ఉత్కంఠ మరికొద్దిసేపట్లో వీడనుంది.
