Home తెలంగాణ ‘పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

‘పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్’.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

7
0

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తన చురుకైన మాట‌ల‌తో, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకవైపు వరుస టీవీ షోలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కడ కనిపించినా ఆమె పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 33 ఏళ్ల వయసులో ఉన్న శ్రీముఖి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర పోషించారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రీముఖి, తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పై మాట్లాడిన శ్రీముఖి సరదాగా మాట్లాడుతూ, ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత పెళ్లి అయింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here