TGN NEWS (పటాన్ చేరు): అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడా బిహెచ్ఎల‍్ మెట్రో కాలనీ పంచముఖి హనుమాన్ దేవాలయం ఆవరణలో, అలాగే కిష్టారెడ్డి పేట్ దుర్గానగర్ కాలనీ ఎలైట్ అపార్ట్మెంట్స్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో విజయదశమి విజయోత్సవం, ఆయుధ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ స్వయంగా హాజరై ఆయుధ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ – “విజయదశమి పండుగ మన సమాజానికి ఐక్యత, ధర్మపాలనకు ప్రతీక. ధర్మమే గెలుస్తుందనే సత్యాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం” అన్నారు. గ్రామాల పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయదశమి ఆయుధ పూజా ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
