TGN NEWS (పటాన్ చేరు): పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఈరోజు ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. జెపి కాలనీలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు DE భాస్కరరావు, AE జగదీష్తో పాటు ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ ఇన్స్పెక్షన్ చేశారు. అనంతరం శిశు మందిర్ కాలనీలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు కాంట్రాక్టర్‌ను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.



