TGN News (కొంపల్లి): మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరిజన బస్తీలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మను ముస్తాబు చేసి ఒక దగ్గర చేర్చి బతుకమ్మ ఆటలాడారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేసారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రోళ్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు గణేష్, క్రాంతి కుమార్, బుడ్డోళ్ళ మోహన్ మహేష్, నరేష్, చిన్న, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
