Home సినిమా ‘ఇడుపు కాయితం’ సినిమాపై కాంట్రవర్సీ.. టైటిల్ చుట్టూ తెలంగాణ-ఆంధ్ర సోషల్ మీడియా వార్..!

‘ఇడుపు కాయితం’ సినిమాపై కాంట్రవర్సీ.. టైటిల్ చుట్టూ తెలంగాణ-ఆంధ్ర సోషల్ మీడియా వార్..!

97
0
  • ఇడుపు కాయితం’పై ఎందుకింత రచ్చ?
  • టైటిల్ చుట్టూ తెలంగాణ vs ఆంధ్ర సోషల్ మీడియా వార్!
  • భాషపై ట్రోల్స్… నెటిజన్ల ఫైర్!
  • సినిమా రిలీజ్‌కు ముందే భారీ కాంట్రవర్సీ

TGN NEWS (హైదరాబాద్): ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభ దశలోనే ఉండగా, సినిమా టైటిల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో వాడే ‘ఇడుపు కాయితం’ అనే పదం అర్థం ఏమిటి? అనే చర్చతో పాటు, తెలంగాణ భాష, యాసపై మరోసారి సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు మొదలయ్యాయి.

అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి?
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇడుపు కాయితం’ అంటే భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవడానికి పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రం (విడాకుల పత్రం) అనే అర్థంలో వాడే స్థానిక పదం. ప్రస్తుతం కోర్టు ద్వారా విడాకులు సాధారణమైనప్పటికీ, గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఉండేదని చెబుతున్నారు.

ఎందుకు వివాదం?
సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే కొందరు నెటిజన్లు “ఈ టైటిల్ అర్థం కావడం లేదు”, “ఆంధ్రలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీనికి తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేయడం సరికాదని, ఇదే భాషా వివక్షకు నిదర్శనమని విమర్శించారు.

సోషల్ మీడియాలో రెండు వర్గాల వాదనలు
ఒకవైపు, “తెలంగాణ పదాలను అర్థం చేసుకోవాలని” కొందరు కోరుతుండగా, మరోవైపు “సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే టైటిల్ పెట్టాల్సింది” అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చ సినిమా ప్రచారానికి ఉపయోగపడుతున్నప్పటికీ, భాషా భేదాలను రాజకీయ, ప్రాంతీయ కోణంలో చూడడం మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ‘ఇడుపు కాయితం’ వివాదం కేవలం ఒక సినిమా టైటిల్ గురించే కాదు. తెలంగాణ మాండలికం, ప్రాంతీయ సంస్కృతి, భాషా గౌరవం వంటి అంశాలపై సమాజంలో ఇంకా సున్నితమైన చర్చ కొనసాగుతోందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. సినిమా విడుదలకు ముందే ఈ చర్చ భారీ ప్రచారాన్ని తీసుకురావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here